సమాజం లో స్త్రీ
ఇష్టపడి కనండి, కష్టపడి పెంచండి
సమానత్వం కల్పించండి, సాదరంగా చూడండి
బాల్యంలో టీచర్ల వికృత చేష్టలు,
యవ్వనంలో కీచకుల యాసిడ్ దాడులు,
రావణుల కిడ్నాపులు, కట్టుకున్నవాడి చే సజీవ దహనాలు,
అత్తా, ఆడపడుచుల అహంకారాలు
ముసలితనం లో పిల్లల అనాదరణ
భర్తల నిర్లక్ష్యం, బంధువుల చిన్న చూపు,
మరణానికి దారి చూపు
ఇవన్ని లేకుండా ఉండాలంటే ఆడవాళ్ళు ఆదిశాక్తులుగా ఎదగాలి
ఆర్ధికంగా శారీరికంగా మానసికంగా బలపడాలి
ఎక్కడ స్త్రీ కి గౌరవం దక్కుతుందో అక్కడ
ఇల్లు, సమాజం, దేశం, అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది