4, జనవరి 2012, బుధవారం

ఫలాలు - నైవేద్యాలు - ఫలితాలు

ఇది చాలా మందికి కావలసిన సమాచారం సేకరించి పెట్టాను:
ఫలాలు - నైవేద్యాలు - ఫలితాలు
  • కమలాపండు - ఆగిపోయిన పనులు పూర్తవుతాయి
  • అరటి పండు - మనసులోని కోరికలు తీరుతాయి
  • అరటి గుజ్జు - అప్పుల బాధ తీరుతుంది
  • సపోటా పండు -  పనులు విజయవంతంగా పూర్తవుతాయి
  • కొబ్బరి - పనులు త్వరగా పూర్తవుతాయి
  • మామిడి - ప్రభుత్వం నుండి కావలసిన పనులు, డబ్బు బకాయిలు తీరుతాయి
  • అంజీర - అనారోగ్యం తగ్గుతుంది (వినాయకుడికి నైవేద్యం పెట్టాలి)
  • నేరేడు పండు - మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి (శనికి), దానం చేస్తే శని వల్ల కలిగే నష్టాలు తొలగుతాయి
  • పనస పండు - శత్రుబాధలు, కష్టాలు తొలగుతాయి
  • ఆపిల్ పండు - జాతక దోషాలు పోతాయి, ఐశ్వరయం లభిస్తుంది
  • ద్రాక్ష పండు - పక్షవాతం తగ్గుతుంది
  • జామ పండు - షుగర్ వ్యాధి తగ్గుతుంది, దానం చేస్తే వివాహం జరుగుతుంది
  • సంకష్ట హర చతుర్ధి నాడు గణపతి కి నైవేద్యం పెడితే ఆరోగ్యం వృద్ధి అవుతుంది. పిల్లలకు మానసిక వ్యాధి తగ్గుతుంది.
  • పులిహోర ప్రసాదంగా గుడిలో శుక్రవారం అమ్మవారి గుడిలో పంచితే వివాహం జరుగుతుంది. మిగితా రోజులలో దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది
  • పెసర పప్పు పొంగలి - సుభ్రమణ్య స్వామికి మంగళవారం నైవేద్యం పెడితే కుటుంబ కలహాలు పోతాయి
  • పెసర పప్పు పొంగలి - గణపతి కి పెడితే పనులు త్వరగా అవుతాయి
  • పెసర పప్పు పొంగలి - సత్యనారాయణ స్వామికి పెడితే మానసిక శారీరిక సమస్యలు పోతాయి
  • పెసర పప్పు పొంగలి - సరస్వతి కి పెడితే పిల్లల జ్ఞాపకశక్తి పెరుగుతుంది
  • పెసర పప్పు పొంగలి - బుధుడు బాగులేనప్పుడు పెడితే నరాల వ్యాధులు తగ్గుతాయి
  •  పెరుగన్నం (దద్దోజనం) నైవేద్యం - 
    • శనివారం ఇలావేల్పుకి పెడితే అప్పుల బాధ తీరుతుంది
    • శుక్రవారం సాయంత్రం లక్ష్మి దేవికి పెడితే ధనవృద్ధి, దానిమ్మగింజలతో పెడితే శత్రుబాధాలు పోతాయి
    • తేనే వేసి లక్ష్మి, విష్ణు సహస్ర నామాలు చదివి నైవేద్యం చేసి తింటే దీర్ఘకాలిక రోగాలు పోతాయి
    • మిరియాల పొడి వేసి, సుభ్రమణ్య స్వామికి పెడితే చర్మవ్యాధులు పోతాయి
    • ఎండు ఖర్జూరాలు కలిపి కులదేవతకు పెడితే ఆర్ధిక సమస్యలు పోతాయి
  • అతుకుల నైవేద్యం - 
    • అటుకులు, తేనే, బెల్లం, అరటి పండు కలిపి శివ పార్వతులకు నైవేద్యం పెట్టి పెళ్లి కాని వారికి పెట్టాలి (సోమవారం) వివాహం జరుగుతుంది
    • అటుకులు, కొబ్బరి, తేనే కలిపి కృష్ణుడికి సాయంత్రం నైవేద్యం పెట్టి పిల్లలకు పంచాలి
    • అటుకులు తేనే మంగళ శుక్రవారాలలో లక్ష్మి నారాయణులకు నైవేద్యం పెడితే ధనం నిల్వ ఉండి అప్పుల బాధ తీరుతుంది
    • గురువారం నాడు అటుకులతో చేసిన పదార్ధం (పులిహోర) గురువులకు పెట్టడం వల్ల గురు దోషాలు పోతాయి, ఆరోగ్య సమస్యలు పోతాయి, సంతాన ప్రాప్తి
    • బుధవారం విష్ణు, లక్ష్మి సహస్రం చేసి పాలతో కలిపినా అటుకులు నైవేద్యం పెడితే చాలా పనులు పూర్తవుతాయి, ఆరోగ్యం, ధనం బాగుంటాయి    

27, డిసెంబర్ 2011, మంగళవారం

సమాజం లో స్త్రీ


సమాజం లో స్త్రీ

ఇష్టపడి కనండి, కష్టపడి పెంచండి
సమానత్వం కల్పించండి, సాదరంగా చూడండి
బాల్యంలో టీచర్ల వికృత చేష్టలు,
యవ్వనంలో కీచకుల యాసిడ్ దాడులు,
రావణుల కిడ్నాపులు, కట్టుకున్నవాడి చే సజీవ దహనాలు,
అత్తా, ఆడపడుచుల అహంకారాలు
ముసలితనం లో పిల్లల అనాదరణ
భర్తల నిర్లక్ష్యం, బంధువుల చిన్న చూపు,
మరణానికి దారి చూపు

ఇవన్ని లేకుండా ఉండాలంటే ఆడవాళ్ళు ఆదిశాక్తులుగా ఎదగాలి
ఆర్ధికంగా శారీరికంగా మానసికంగా బలపడాలి
ఎక్కడ స్త్రీ కి గౌరవం దక్కుతుందో అక్కడ
ఇల్లు, సమాజం, దేశం, అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది